News

ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలికలకు రాష్ట్రీయ బాల పురస్కారాలు

10views

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు బాలికలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు లభించాయి. క్రీడా విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొలగట్ల ఆలన మీనాక్షి, సాంస్కృతిక విభాగంలో తెలంగాణకు చెందిన ఎం గౌరవి రెడ్డిని ఈ అవార్డు వరించింది. వీరిద్దరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 9 మంది బాలలు సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 2016లోనే ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ కౌన్సిల్‌కు నామినేటైన నృత్యకారిణి గౌరవి రెడ్డి అతిచిన్న వయస్సులో ఈ ఘనత సాధించి రికార్డుల్లోకి ఎక్కింది. అంతర్జాతీయ చందరంగం క్రీడాకారిణి మీనాక్షి 2022 అక్టోబరులో ప్రకటించిన ర్యాంకింగ్‌లో 11 ఏళ్లలోపు వయసు కేటగిరీలో ప్రపంచ నెంబర్‌ వన్‌ క్రీడాకారిణిగా నిలిచింది.