News

హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలి – శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద భారతి

274views

అన్య మతాల వారికి కొమ్ము కాస్తున్న నేటి పాలకుల నుంచి హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలని శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద భారతి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాలుగు మండలాల మేలుకొల్పు బృందాలు టి.అర్జాపురంలో చేపట్టిన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసనంద భారతి మాట్లాడుతూ, సర్వ మతాలను గౌరవిస్తున్న హిందూ ధర్మంపై దుష్ట ప్రచారం,అణివేత ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్‌ అమర లింగన్న, సమరసతా సేవ ఫౌండేషన్‌ ఆంధ్ర ప్రాంత ప్రముఖులు కొండారెడ్డి, అర్జాపురం సర్పంచ్‌ ఎం.పాల్గుణ, వైస్‌ ఎంపీపీ భవానీ ప్రసాద్‌, టీడీపీ మండల అధ్యక్షుడు రాజాన కొండనాయుడు తదితరులు పాల్గొన్నారు.