తెలంగాణ హిందూ బాలికపై ఇద్దరు ముస్లిం సోదరుల అత్యాచారం.. బాలిక నగ్న చిత్రాలు తీసి బెదిరించిన నిందితులు!

తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు 15 ఏళ్ల వయసున్న హిందూ మైనర్ బాలికపై ఇద్దరు ముస్లిం యువకులు ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ యువకుల ఆగడాలతో విసిగిపోయిన బాలిక చివరకు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో స్పందించిన వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
బాలికకు మాయమాటలు చెప్పి.. ఆపై వంచించి!
పదో తరగతి చదువుతున్న బాలికపై ఇంటి పక్కనే ఉంటున్న ఇద్దరు ముస్లిం సోదరులు కన్నేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యారు. ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా గత ఆరు నెలలుగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నారు. వీడియోలు రికార్డు చేసి ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని బెదిరించారు. తీరా విషయం కాస్త బాలిక తల్లికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితులు వీరే..
వరంగల్ నగరంలోని ఓ కాలనీలో పదిహేనేళ్ల బాలిక తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో అలీ(26), అబ్బు (22) సోదరులు ఉంటున్నారు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఈ బాలికపై కన్నేసిన వీరు.. మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నారు. ఎవరూ లేని సమయంలో ఒకరికి తెలియకుండా మరొకరు ఇంటికి పిలిపించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ టైంలో వీడియోలు రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బాలికను బెదిరించేవారు. బాలికకు నిందితులు పలుమార్లు సైగలు చేయడాన్ని గమనించిన తల్లి… విషయం ఏంటని ఆరా తీయగా.. బాలిక అసలు విషయం చెప్పింది.
వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల ఇంటిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బీజేపీ నాయకులు దాడి చేశారు. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఈ ఘటనపై వరంగల్ నగర సీపీ ఏవీ రంగనాథ్ స్పందించారు. బుధవారం అర్ధరాత్రి ఫిర్యాదు అందిందని చెప్పారు. మైనల్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని వెల్లడించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.





