News

యువతిని హత్య చేసిన ముస్లిం యువకుడు!

437views

బుడేల్: చండీగఢ్​లోని బుడేల్​లో​ ఘోరం జరిగింది. 18 ఏళ్ళ యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోమని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. అందుకు బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఆమె ఇంట్లోకి చొరబడి గొంతుకోసి చంపేశాడు. నిందితుడు బిహార్​కు చెందిన మహ్మద్ షరీక్​(25)గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుడిని సెక్టార్- 43 బస్టాండ్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుడు ఎదురెదురు ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మృతురాలి తల్లి పనిమనిషిగా పనిచేస్తోంది. యువతి తండ్రి.. ఉత్తర్​ప్రదేశ్​లో ఉంటున్నాడు. నవంబర్ 19న యువతి సోదరుడు ఇంటికి వచ్చే చూసేసరికి ఆమె మంచంపై అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాధితురాలు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. నిందితుడు ఓ హోటల్​లో పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా బాలికను తనతో శారీరక సంబంధం పెట్టుకోమని వేధించేవాడు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి