
రాజకీయ దౌర్జన్యాలూ, హత్యలతో పశ్చిమ బెంగాల్ అట్టుడికిపోతోంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ప్రధాని నరేంద్ర మోడీ సభ జరిగి ఒక రోజు కూడా పూర్తి కాక ముందే అదే ఊరిలోని BJP బూత్ ఆఫీసు ముందు వురి వెయబడ్డ ఒక వ్యక్తి శవం లభించడం సంచలనం సృష్టించింది. లబించిన సమాచారం ప్రకారం మృతుడు షుమారు 42 సంవత్సరాల వయసు గల నిత్య మండల్ గా భావిస్తున్నారు. అతను ఆ మునిసిపాలిటీలో 36వ వార్డుకు చెందిన కార్మికునిగా గుర్తించారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.
బాలాకోట్ దాడులను ప్రశ్నించడం వంటి చర్యల ద్వారా మమతా బెనర్జీ దేశ ప్రగతికి వేగ నిరోధకంగా మారారని మోడీ విమర్శించిన తర్వాతి రోజునే ఈ ఘటన జరగడం గమనార్హం.

మమతా బెనర్జీ నాయకత్వంలోని పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్షాలపై, ప్రత్యేకించి BJP కార్యకర్తలపై తీవ్రమైన భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యనే పశ్చిమ బెంగాల్లోని ఇస్లాంపూర్లో అపూర్వ చక్రవర్తి అనే కార్యకర్తను తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన గూండాలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఉత్తర బంగా మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ప్రస్తుతం అతను చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. అతను పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్ పూర్ జిల్లా BJP నాయకుడు.

\గత వారం మాల్దా జిల్లా పఠాను మండల గ్రామ పంచాయితీ సభ్యుని సోదరుడైన ఉత్పల్ ని తృణమూల్ కాంగ్రెస్ గూండాలు కాల్చి చంపారు.
BJP లో చేరబోతున్నారన్న వార్తల మధ్య తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోవన్ ఛటర్జీ, ఆయన సన్నిహితుడు బైషకీ ఛటర్జీని ఒక బంగ్లాలో బంధించి ఉంచారని ఆరోపణలు ఉన్నాయి.
గత సంవత్సరం మే నెలలో నదియా జిల్లాలో ఆర్నెల్ల గర్భిణీ తృణమూల్ కార్యకర్తల చేత అత్యాచారానికి గురయ్యింది. ఆమె BJP గ్రామ పంచాయితీ సభ్యుని దగ్గరి బంధువు కావడం గమనార్హం.

గత సంవత్సరం జరిగిన పంచాయితీ ఎన్నికలలో 20 వేలకు పైగా గ్రామ పంచాయితీలను తృణమూల్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలవడంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కలుగజేసుకోవలసిందిగా BJP సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది.

పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ ప్రాంతాలలోకి BJP చొచ్చుకుపోతుండడం మమతా బెనర్జీని అసహనానికి గురి చేస్తోంది. అందుకే ఆమె ప్రధాని మోడీ మరియు అమిత్షాలతో సహా పలువురు BJP నాయకులపై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు.





