News

60 ఏళ్ళు దాటిన భూతకోల నృత్యకారులకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం

312views

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ళు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్టు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్విటర్‌ వేదికగా ట్వీట్ చేశారు. ఆర్థికసాయం అందించనున్నట్టు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్విటర్‌ వేదికగా ట్వీట్ చేశారు.

“దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్‌ అందిస్తుంది. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. అలవెన్స్‌ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైకి, మంత్రి సునీల్‌ కుమార్‌ కాకర్లకు కృతజ్ఞతలు” అని పీసీ మోహన్‌ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి