News

బెంగాల్ ఇండియాలో ఉందా? పాకిస్తాన్లో ఉందా? హిందువులపై రోజు రోజుకీ పెరుగుతున్న అత్యాచారాలు. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ సురక్షితమేనా?

757views

మతా బెనర్జీ పాలనలో బెంగాల్ సురక్షితమేనా? హిందువులపై రోజు రోజుకీ పెరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే బెంగాల్ ఇండియాలో ఉందా? పాకిస్తాన్లో ఉందా? అన్న అనుమానం కలుగక మానదు. పాకిస్తాన్లో ఇద్దరు బాలికలను అపహరించి, బలవంతంగా మతం మార్చి, వివాహం చేసుకున్న ఘటన మరువక ముందే సాక్షాత్తు భారత్ లోని కొలకత్తా కూడా సరిగ్గా అలాంటి ఘటనే జరగడం గమనార్హం. ఈ విషయాన్ని “మై నేషన్” అనే వార్తా సంస్థ  బైట పెట్టింది.

ఒక మైనర్ బాలిక సహా ఇద్దరు బాలికలు అపహరణకు గురయ్యారు. వారిని బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకున్నారు. ఆ పిల్లల తండ్రి తాము నివసిస్తున్న ప్రాంతంలో తన కూతుళ్ళతో సహా పలువురు హిందూ బాలికలను అపహరించి, వారి కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించి, మతం మార్చి, అనంతరం వివాహం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మార్చ్ 31వ తారీఖున కూడా మరోసారి బాధిత బాలికల తండ్రి పోలీసులకు తాజాగా ఈ విషయమై ఫిర్యాదు చేసి తనకు న్యాయం జరిపించాలని అభ్యర్ధించాడు.

మొదటగా మార్చ్ 11న ఈ ఘటన విషయమై బాలికల తండ్రి కేసు పెట్టారు. పోలీసుల వెతుకులాటలో ఇరువురిలో మైనర్ అయిన బాలిక ఆచూకీ తెలిసింది. ఆమెకంటే పెద్దదైన ఆమె సోదరి ఆచూకీ తెలియాల్సి వుంది. ఇంటికి చేరుకున్న మైనర్ బాలిక తన భయంకర అనుభవాన్ని వివరించింది.

తనను, తన అక్కను అపహరించిన వ్యక్తులు తమను వివాహం చేసుకోవాలని, లేకపోతే తమ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించారని, తమను తీవ్రంగా హింసించారని తెలిపింది.

కొలకత్తాలోని బుర్రా బజార్ ప్రాంతంలోని బడి మజీద్ లో తన కుమార్తెకు బలవంతంగా వివాహం చేశారని, ముస్లిం వివాహ రిజిష్టర్లో ఆమెను మేజర్ గా చూపారని బాధిత మైనర్ బాలిక తండ్రి తెలిపారు. కొలకత్తా పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చెయ్యలేదని, తన కుమార్తెపై లైంగిక అఘాయిత్యమేమైనా జరిగినదా? అన్న విషయం నిర్ధారించే వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా పోలీసులు ముందుకు రావడంలేదని ఆయన ఆరోపించారు.

“మై నేషన్” కథనాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమీషన్ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ పోలీసులను సత్వర చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించింది.