
5.5kviews
హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ హాస్టల్ సమీపంలో జరుగుతున్న ఆరెస్సెస్ శాఖపై ఎస్. ఎఫ్. ఐ కార్యకర్తలు దాడి చేశారు. యునివర్సిటీ హాస్టల్ సమీపంలో శాఖ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్. ఎఫ్. ఐ కార్యకర్తలు క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో దాడి చేశారు. అందిన సమాచారం మేరకు 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. అక్కడి పూర్తి సమయ కార్యకర్త, విభాగ్ ప్రచారక్ శ్రీ అజయ్ కూడా గాయపడ్డ వారిలో వున్నారు. గాయపడ్డ విద్యార్ధులందరినీ ఐ.జీ.ఎం.సి మరియు రిపాన్ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసు విచారణ కొనసాగుతోంది.





