News

ట్రాన్స్ ‌పోర్ట్ కుంభకోణంలో కేజ్రీ సర్కార్

233views

ప్పటికే మద్యం విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని ఆప్‌ (AAP) ప్రభుత్వానికి మరో కొత్త చిక్కు వచ్చిపడింది. ఢిల్లీ ట్రాన్స్ ‌పోర్ట్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన ‘లోఫ్లోర్‌ బస్సు’ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (LG) వి.కె.సక్సేనా ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

జులై 2019లో ఢిల్లీ ప్రభుత్వం 1,000 లోఫ్లోర్‌ బస్సుల కొనుగోలుకు బిడ్లు ఆహ్వానించింది. వాటి వార్షిక నిర్వహణకు సంబంధించిన ఒప్పందం కోసం మార్చి 2020లో మరోసారి బిడ్ల దాఖలుకు అనుమతించింది. ఈ రెండు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జూన్‌లో ఎల్‌జీకి ఫిర్యాదు అందింది. బస్సుల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు వేసిన కమిటీకి ఛైర్మన్ ‌గా ఢిల్లీ రవాణాశాఖ మంత్రిని నియమించడం కూడా ఈ కుట్రలో భాగమేనని అందులో పేర్కొన్నారు. అలాగే అవకతవకలకు సహకరిస్తారనే ఉద్దేశంతోనే డీఐఎంటీఎస్ ‌ను బిడ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టంట్ ‌గానూ నియమించినట్లు ఆరోపించారు.

దీనిపై సంబంధిత ఢిల్లీ ప్రభుత్వ విభాగాల స్పందనను కోరుతూ జులై 22న ఫిర్యాదును ఎల్‌జీ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి పంపింది. దీనిపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఓ.పి.అగర్వాల్‌ నేతృత్వంలో సీఎస్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరి విచారణ ఆధారంగానే లెఫ్టినెంట్‌ గవర్నర్ ‌కు ప్రధాన కార్యదర్శి ఆగస్టు 22న నివేదిక పంపినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతే ఫిర్యాదును లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సీబీఐకి పంపినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణ జరుపుతున్నట్లు తెలిపాయి. దీంతో రెండింటినీ కలిపి దర్యాప్తు చేయాలని సక్సేనా సూచించినట్లు వెల్లడించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.