
398views
కాణిపాకం: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కాణిపాక దేవస్థానం ఒకటి. సత్యప్రమాణాల దేవుడిగా కాణిపాక వినాయకుడికి పేరు. అలాంటి వరసిద్ధి వినాయకస్వామికి ఈనెల 31వ తేదీ (చవితి)నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక్కడ ఏటా భాద్రపద శుద్ధ చవితి నుంచి జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. తొలి తొమ్మిది రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పదో రోజు నుంచి పన్నెండు రోజులపాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో ఆలయంలో విద్యుత్ లైట్లు కటౌట్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో ఆలయంలోని అలంకార మండపంలో దేవతా మూర్తులను అమర్చారు. ఆలయంలో అలంకార మండపంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆలయం వెలుపల కటౌట్‌లు ఏర్పాటు చేయడానికి విద్యుత్ లైట్ల కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.





