News

నేరస్తులకు సింహ స్వప్నం యు.పి. ఎన్కౌంటర్లో ముగ్గురు నేరస్తులు హతం.

991views

వైశాలి (ఉత్తర ప్రదేశ్): ఉత్తరప్రదేశ్ నేరస్తుల పాలిట సింహస్వప్నంలా మారిపోతోంది. రౌడీలకు, గూండాలకు నూకలు చేల్లిపోతున్నాయి. ఎవరైనా తోక జాడిస్తే తోలు తీస్తున్నారు పోలీసులు. ఈ రోజు ఉదయం ఉత్తరప్రదేశ్లోని  బొహ్లాపూర్లోని వైశాలి  వద్ద  ముగ్గురు క్రిమినల్స్ ని  పోలీసులు ఎన్కౌంటర్ లో మట్టుబెట్టారు. మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

“ఈ ప్రాంతంలో నేరస్తులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు దాడి చేసి ముగ్గుర్ని మట్టుబెట్టాం. మరో ముగ్గుర్ని అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి 2 ఏ.కే 47 తుపాకులు, పిస్తోళ్ళు స్వాధీనం చేసుకున్నాం. ” అని ఎస్.పి  ధిల్లాన్ తెలిపారు. తర్వాతి విచారణ కొనసాగుతుంది.