
న్యూఢిల్లీ: ‘కాళి’ పేరుతో రిలీజ్ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్‌పై వివాదం రాజుకుంది. డైరెక్టర్ లీనా మణిమేకలై తాజాగా రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం ‘కాళీ’ పోస్టర్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో కాళీమాత గెటప్‌లో ఉన్న నటి ఒక చేతితో త్రిశూలం పట్టుకుని, మరో చేతితో సిగిరెట్ తాగుతున్నట్టు ఉంది. మరో చేతితో ఎల్‌జీబిటీ జెండాను పట్టుకున్నట్టు పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది.
తమిళనాడులో పుట్టి ప్రస్తుతం టొరంటో(కెనడా)లో ఉంటున్న లీనా మణిమేకలై.. కాళి టైటిల్‌తో రెండు రోజుల క్రితం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. పోస్టర్ అభ్యంతరకరంగా ఉందని, లీనా మణిమేకలై వెంటనే క్షమాపణలు చెబుతూ, పోస్టర్‌ను తొలగించాలంటూ కొందరు నెటిజన్లుహెచ్చరికలతో కూడిన డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో ఆమె వెనక్కి తగ్గకపోగా మరింత రెచ్చగొట్టేలా ఓ ట్వీట్ చేశారు.
Source: Velugu





