
ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ వైరస్ ను గుర్తించే RT-PCR కిట్ ను భారత్ కి చెందిన ట్రివిట్రాన్ హెల్త్ కేర్ సంస్థ రూపొందించింది. ఈ కిట్ తో గంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బ్రిటన్, కెనడా, అమెరికా సహా 21 దేశాల్లో 200కు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు కాగా మరో 100 మందిలో అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. మశూచికి వాడే టీకాలు మంకీపాక్స్ పై పనిచేస్తాయా? అన్న అంశంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.
పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మన దేశంలో కూడా పలు రాష్ట్రాల వైద్యారోగ్యశాఖలు అప్రమత్తమవుతున్నాయి. మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్లో ఉంచనున్నట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.
ఇటీవల మంకీ పాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ఒంటిపై రాషెస్ వచ్చిన వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులను అదేశించింది. అనుమానితులు జిల్లా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. అనుమానితుల రక్త నమూనాలను పూణేలోని ఎన్‌ఐవీకి పంపనున్నట్టు వెల్లడించారు.





