
406views
ఢిల్లీ నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనేక ప్రాంతాల్లో బుల్డోజర్ల సాయంతో అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నారు. ఈనెల 4 నుంచి 13 వరకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా దక్షిణ ఢిల్లీ పరిధిలో న్యూ ఫ్రెండ్స్ కాలనీ, నార్త్ ఢిల్లీ, మంగోలురిలలో అనుమతి లేని నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.





