
595views
ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించే వాళ్లు, ఆడపిల్లని పురిటిలోనే చంపేసేవాళ్లు ఈ వ్యక్తిని చూసి ఎంతో నేర్చుకోవాలి.
తనకు మనవరాలు పుట్టిందని తెలిసి ఏకంగా హెలికాప్టర్‌లో తనని ఇంటికి తీసుకువచ్చాడు. అయితే.. ఆయన బడా వ్యాపారవేత్తో, సినీ ప్రముఖుడో కాదు. నాగలి పట్టి పొలం దున్నే ఓ రైతు.
వివరాల్లోకి వెళ్తే.. పుణెలోని బాలువాడి ప్రాంతానికి చెందిన అజిత్ పాండురంగ్ బల్వాడ్కర్‌కు మనవరాలు పుట్టిందని తెలిసి ఆనందంలో ఉప్పొంగిపోయాడు. మంగళవారం ఆ పాపను అమ్మమ్మ వాళ్లింటి నుంచి తీసుకురావడానికి హెలికాప్టర్ బుక్ చేశాడు. తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్న ఆయన ‘మా కుటుంబంలోకి ఆడపిల్ల రావడం మాకెంతో ఆనందంగా ఉంది. మా సరికొత్త సభ్యురాలు కృషికాకు మేమంతా ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇలా ఆకాశమార్గంలో ఆమెను తీసుకువచ్చాం’ అని సంతోషం వ్యక్తం చేశాడు.





