
1kviews
పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో వీర మరణం పొందిన భారత సీఆర్ పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు నిరసన ప్రదర్శనలు, పాకిస్తాన్ దిష్టి బొమ్మల దహనం చేశారు.
ప్రజలు అమర జవాన్లకు నివాళిగా మౌనం పాటించారు.దాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశ రక్షణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తూ అమరులవుతున్న జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.







