News

చైనాకు చెక్ పెట్టుకునేందుకు నిర్ణయం

398views
  • 350 రకాల ముడిసరుకు పై కస్టమ్స్ సుంకం రద్దు

న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ ప్రోత్సహించడానికి 350 ముడిసరకులపై కేంద్రం కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 40కి పైగా ఉత్పత్తుల మీద కస్టమ్స్ మినహాయింపులను ప్రకటించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబిఐసీ) ట్వీట్ చేసింది.

మొత్తంగా ఉత్పత్తుల మీద 350 కస్టమ్స్ సుంకాలను ఉపసంహరించుకుంటామని సీబిఐసీ తెలిపింది. వీటిలో మినహాయింపులు పొందుతున్న కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, బట్టలు, వైద్య పరికరాలు, మందులు లాంటివి ఉన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి