News

పాకిస్థాన్ కోసం అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా

519views

* ఏడాదిలోపే అందుబాటులోకి రానున్నట్లు వెల్లడి

అంతరిక్ష కేంద్రం అభివృద్ధి, మరికొన్ని ఉపగ్రహాల ప్రయోగం సహా పాకిస్థాన్‌తో అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసే ప్రణాళికలను చైనా ప్రకటించింది. పాకిస్థాన్‌ కోసం సమాచార ఉపగ్రహాల అభివృద్ధికి ప్రాధాన్యం, పాకిస్థాన్‌ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి సహకారం అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు శ్వేతపత్రంలో ప్రకటించింది. చైనా నిర్మిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం ఈ ఏడాదికల్లా సిద్ధం కానుంది.

2018లో పాకిస్థాన్‌ ప్రయోగించిన రెండు ఉపగ్రహాలకు తోడ్పాటు అందించిన చైనా 2019లో అంతరిక్ష పరిశోధనలు, మిత్రదేశాల మధ్య అంతరిక్ష శాస్త్ర సహకారాన్ని మరింతగా ఉదృతం చేసే ఒప్పందంపై సంతకాలు చేసింది. పాకిస్థాన్‌, వెనిజులా, సుడాన్‌, అల్జీరియన్‌ ఉపగ్రహాలు కక్ష్యలో చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో చైనా వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.