News

ఒక ఉగ్రవాది సైనికుడిగా మారాడు.. భారతదేశం కోసం ప్రాణాలను అర్పించాడు..!

700views

ఒక ఉగ్రవాది భారత సైన్యంలో స్థానం సంపాదించాడు. భారతదేశం కోసం ప్రాణాలను సైతం అర్పించాడు. అతడికి అశోక చక్ర పురస్కారం లభించింది. అతడి పేరు నాజిర్ అహ్మద్ వనీ. అతడు 2004కు ముందు వరకూ ఉగ్రవాదిగా ఉన్నాడు. కొందరి తప్పుడు మాటలు విని టెర్రరిస్టుగా మారిపోయిన నాజిర్ అహ్మద్ వనీ అప్పట్లో భారతదేశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తాను చేస్తోంది తప్పని అనుకున్నాడు. భారతమాత గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. 2004 లో భారత ఆర్మీకి లొంగిపోయి.. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని భావించాడు. కౌంటర్- ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లో భాగమయ్యాడు. అతనికి  ఆర్మీ 162వ బెటాలియన్ లో స్థానం కల్పించారు. కుల్గాంకు చెందిన వనీ, సైనికుడిగా రెండు సార్లు సేనా మెడల్ పురస్కారాన్ని అందుకున్నాడు.

Source : Bharath Today.

https://www.bhaarattoday.com/news/national/story/30411.html