News

బిగ్‌బాస్‌లో హిందూ దేవుళ్ళను కించపరుస్తున్నారు…

383views
  • షోపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌

  • బ్యాన్‌ చేయాలంటూ రాజా సింగ్‌ డిమాండ్‌

భాగ్యనగరం: బిగ్‌బాస్‌ షోలో హిందూ దేవుళ్ళను కించపరుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో బిగ్‌బాస్‌ గేమ్‌ షోను బ్యాన్‌ చేయాలి.. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్థంకావడంలేదన్నారు. యాంకర్‌ రవి ఎలిమినేట్‌ అయ్యి బయటకు రావడంలో ఏదో జరిగిందని అన్నారు. రవి విషయంలో ఏం జరిగిందో బయటకు రావాలి అన్నారు.

ప్రశాంతంగా ఉన్న హైద్రాబాద్‌లో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్స్‌ తెచ్చి రెచ్చగొడుతున్నారని రాజా సింగ్‌ ఆరోపించారు. గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర రచ్చరచ్చ చేశారు.. అసలు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి ప్రజలకు ఏం మేసెజ్‌లు ఇస్తున్నారు? చిన్న పిల్లలు, మహిళలు బిగ్‌బాస్‌ కంటెంట్‌ చూడలేకపోతున్నారు అని ఆయన అన్నారు. బిగ్‌బాస్‌ షోకి సైతం సెన్సార్‌ ఉండాల్సిందే.. బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలనీ కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానన్నారు. కాగా, ఈ షో ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటోంది. సీపీఐ నారాయణ కోర్టులో కేసు కూడా వేశారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి