
579views
-
అత్యంత ప్రమాదకరమైనవి 18
-
గుర్తించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు
బీజింగ్: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ల కలకలం మొదలైంది. ఏకంగా 71 రకాల వైరస్లను గుర్తించారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. వీటిలో 18 ప్రమాదకరమైన వైరస్ ఉన్నాయి. చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ పరీక్షలు నిర్వహించారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1725 వన్య ప్రాణులపై ఈ పరీక్షలు జరిపినట్టు వెల్లడించారు.
చైనా ప్రభుత్వం విక్రయానికి నిషేధించిన పలు జంతువులపైన కూడా శాస్త్రవేత్తలు జరిపారు. అత్యధికంగా సివెట్స్ అనే జంతువుల్లో ప్రమాదకర వైరస్లను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గబ్బిలా నుంచి వచ్చే హెచ్కేయూ8 రకం కరోనా వైరస్ ఓ సివెట్కు వ్యాప్తించినట్టు గుర్తించామన్నారు. ఇంకా పలు జంతువుల్లో కూడా ఈ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు.





