News

టర్కీని గ్రే జాబితాలో చేర్చిన అంతర్జాతీయ సంస్థ

443views
  • ఇరకాటంలో పాక్

న్యూఢిల్లీ: కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు వంతపాడుతూ ఇండియాను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న టర్కీకి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు నిధుల సరఫరా, నగదు అక్రమ చలామణీలను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఆ దేశంపై ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) కొరడా ఝళిపించింది. దాని మిత్రదేశం పాక్‌ మూడేళ్లుగా కొనసాగుతున్న గ్రే జాబితాలో టర్కీని కొత్తగా చేర్చింది. ఇప్పటికే ఆర్థిక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ఆ దేశానికి ఇది మింగుడుపడని పరిణామమేన‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి