News

ప్రసాదంలో విషం కలిపిన నిందితులు అరెస్ట్.

709views

కర్ణాటక రాష్ట్రంలో ప్రసాదం తిని 11 మంది చనిపోయిన తెలిసిందే. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 72 మంది ప్రసాదం తిని ఆసుపత్రిలో చేరారు. 12 మంది పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలోని సులివాడీ గ్రామంలో చోటుచేసుకుంది. పరిస్థితి సీరియస్ గా ఉన్న వారిని మైసూరులోని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ఒక్కో వివరాన్ని కూపీ లాగుతున్నారు. ముఖ్యంగా ప్రసాదం తిన్న వర్గాన్ని లేపేయాలని భావించి విషం కలిపినట్లు తెలుస్తోంది. రెండు వర్గాల మధ్య గతంలో ఏదో గొడవ జరిగిందని.. ఇంతకూ ఆ గొడవ ఏమిటో కనుక్కోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక మరికొంత మంది ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విషయాలు పోలీసులు వెల్లడించనున్నారు.

శుక్రవారం నాడు మారమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమం జరిగాక పంచిన ప్రసాదం తిని భక్తులు అస్వస్థతకు గురయ్యారు. భక్తులకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వెజిటబుల్ పలావ్ ప్రసాదంగా ఇచ్చారు. అది తిన్నాక కొంతమంది వాంతులు.. మరి కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పటికి 11 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పలావ్ తిన్న 60కి పైగా కాకులు కూడా చనిపోయాయి.

Source: Bharath today.