News

ఏపీలో దసరా ఉత్సవాలకు అనుమతి

603views

అమరావతి: ఏపీ ప్రభుత్వం దసరా ఉత్సవాలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి శ్రీనివాస్‌ కీలక ప్రకటన జారీ చేశారు. అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.

కాగా, మరో రెండు రోజుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి వచ్చే భక్తులందరూ కొవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. భక్తుల కోసం అత్యవసర వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. గత ఏడాది జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కొండచరియలు జారకుండా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి