News

ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసింది…

223views
  • కృష్ణపట్నం ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు

విజయనగరం: ఏపీలోని నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం ఆనందయ్య… దాదాపు అందరికీ సుపరిచితుడే. కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్న వైద్యుడు. విజయనగరంలో తాజాగా జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనందయ్య ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలిపారు. ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసిందని ఆరోపించారు.

తన మీద కేసులు పెట్టి అరెస్ట్‌ చేయించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించిందని, కృష్ణపట్నం గ్రామస్తుల మద్దతుతోనే నిలబడగలిగానని అన్నారు. ప్రజల్లో తనకున్న ఆదరణ చూసి పోలీసులు కూడా భయపడ్డారన్నారు. కరోనా సమయంలో మందు పంపిణీ చేసేందుకు సిద్ధమైతే ప్రభుత్వం అనుమతి లేదని చెప్పిందన్నారు. బీసీలు అండగా నిలిచారని.. పోరాటానికి సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం కూడా ఇబ్బంది వస్తుందని భావించి కోర్టు ఆదేశాలతో అనుమతి ఇచ్చిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ప్రభుత్వం భయపడిరదని కొంతమంది స్వార్థపరుల సాయంతో రాజకీయ నేతలు సర్వనాశనం చేస్తున్నారన్నారు. ఎంతోమంది కరోనా రోగులకు ఉచితంగా మందుని అందించానన్నారు. తన కుటుంబ వారసత్వం తాను కొనసాగిస్తూ ఆయుర్వేదం నేర్చుకుని కరోనాకి మందు కనిపెట్టి ప్రజలకు పంపిణీ చేశానన్నారు. లక్షలు మంది నమ్మకాన్ని చెడగొట్టేలా ప్రయత్నాలు జరిగాయని.. తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని విమర్శలు చేశారు.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి