News

చిన్నారిని ఉరేసి చంపిన తాలిబన్లు!

935views

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆటవిక పాలన మొద‌లైంది. ఆటవిక శిక్షలతో తాలిబన్లు నరరూప కాలకేయుల వలె ప్రవర్తిస్తున్నారు. మహిళలపై ఆంక్షలతో ప్రారంభమైన తాలిబన్ల పాలన.. బహిరంగ ఉరిశిక్షలు, చేతులు, కాళ్లు నరికివేతలు, క్షౌర శాలలపై నియంత్రణ లాంటి చట్టాల వరకూ వెళ్లింది.

తాజాగా.. తాలిబన్లు ఓ బాలుడిని బహిరంగంగా దారుణంగా చంపారు. ఆ బాలుడి తండ్రి తాలిబన్ల వ్యతిరేక దళంలో పనిచేస్తున్నాడనే అనుమానంతో తాలిబాన్లు చిన్నారిని ఉరివేసి చంపారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్ తఖర్ ప్రావిన్స్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ దేశంలోని పరిస్థితులను కవర్ చేసే ఒక స్వతంత్ర మీడియా సంస్థ పంజ్‌షీర్ అబ్జర్వర్ షేర్‌ చేసింది.

బాలుడి మృతదేహం పక్కన మరో ముగ్గురు చిన్నారులు ఏడుస్తూ కూర్చొని ఉన్నట్లు మీడియా తెలిపింది. తాలిబన్లు మరింత క్రూరత్వంగా తమ మార్క్‌ పాలనను చూపిస్తున్నారంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. చిన్నారిని ఉరి తీయడం హక్కులను హరించడమేనని పేర్కొంది.

Source: TV9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.