News

కొత్తా దేవుడండీ… కొంగొత్తా దేవుడండీ… : ‘సిఎం పినరయి విజయన్ కేరళ దేవుడు’ అంటూ కేరళలో వెలసిన బోర్డులు – హిందువుల ఆగ్రహం

903views

హిందువుల పట్ల, హిందూ సంస్కృతి పట్ల కమ్యూనిస్టులకున్న తీవ్ర ద్వేషాన్ని తెలియజేసే మరో సంఘటన కేరళలో చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని పీచేరి వద్దగల విష్ణు దేవాలయం ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను దేవుడిగా పేర్కొంటూ ఓ బోర్డు వెలసింది. ” దేవుడెవరు? మీకు ఆహారం అందించేవాడు దేవుడు” అని వ్రాసి క్రింద ముఖ్యమంత్రి విజయన్ ఫోటోను ముద్రించి, దాని క్రింద ” కేరళ దేవుడు” అని ఆ బోర్డులో పేర్కొన్నారు.

అక్కడ దేవాలయము ఉన్నదని సూచించే నేమ్ బోర్డ్ పైననే సదరు బోర్డును తగిలించడం గమనార్హం. ఈ బోర్డు చూసి ఆగ్రహోదగ్రులైన స్థానిక హిందువులు కేరళ ముఖ్యమంత్రి, పాలక కమ్యూనిస్టు పార్టీల వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వీధుల్లోకి వచ్చారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.