ArticlesNews

చైనా కోవిడ్ వ్యాక్సిన్ సినోవాక్ ‌వేసుకుని కూడా కోవిడ్ బారిన పడ్డ 600 మంది థాయిలాండ్ ఆరోగ్య కార్యకర్తలు

440views

చైనా తయారు చేసిన సినోవాక్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ 618 మంది తమ ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ బారిన పడ్డట్టుగా థాయిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూలై 11, 2021 (ఆదివారం)న తెలిపింది. వారిలో నర్సు మరణించారని, మరో వైద్య కార్యకర్త పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

సీనియర్ ఆరోగ్య అధికారి సోపోన్ ఇమ్సిరితావోన్ ఆదివారం ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఏప్రిల్ 2021 నుండి జూలై 2021 వరకు 6,77,348 మంది వైద్య సిబ్బందికి చైనా వ్యాక్సిన్లు వేసుకున్నారని, అందులో 600 మందికి పైగా కోవిడ్ -19 బారిన పడ్డారని చెప్పారు. .

చైనా వ్యాక్సిన్ సినోవాక్ సమర్థతపై సందేహాలు వ్యక్తం చేస్తున్న సింగపూర్ అధికారులు

గత నెలలో చైనా సినోవాక్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ, సింగపూర్‌లోని ఉన్నతాధికారులు దాని ప్రభావంపై సందేహాన్ని వ్యక్తం చేశారు. నివేదికల ప్రకారం, దేశంలో చైనా వ్యాక్సిన్ కోసం ప్రారంభంలో డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, సింగపూర్ ప్రభుత్వం దీనిని జాతీయ టీకా కార్యక్రమానికి చేర్చడానికి సంకోచించింది. సినోవాక్ కు బదులుగా, తన జాతీయ టీకా కార్యక్రమం కింద ఫైజర్-బయోఎంటెక్ మరియు మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్లను అందించింది.

సింగపూర్ వైద్య సేవల డైరెక్టర్ కెన్నెత్ మాక్ మాట్లాడుతూ, టీకా ప్రభావంపై తాను ఆందోళన చెందుతున్నానని, ఇతర దేశాల నుండి వస్తున్న నివేదికలు సినోవాక్ వ్యాక్సిన్ ను వేయించుకున్న వారు ఇంకా కోవిడ్ -19 బారిన పడుతున్నారని సూచిస్తున్నాయి. ఇండోనేషియా నుండి కోవిడ్ -19 బారిన పడ్డ ఆరోగ్య కార్యకర్తలు మరియు వైద్యులు ఆసుపత్రిలో చేరిన వైనాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

మేడ్-ఇన్-చైనా సినోవాక్ వ్యాక్సిన్ ‌పై ఆధారపడిన దేశాలలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

ఇండోనేషియాతో పాటు, చైనా తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్లపై ఆధారపడిన బహ్రెయిన్, యుఎఇ, మంగోలియా, సీషెల్స్ వంటి దేశాలు కూడా కరోనా కేసుల పెరుగుదలను చూశాయి.

తమ టీకా అంత సమర్ధవంతంగా పనిచేయదని అంగీకరించిన చైనా :

ఆసక్తికరంగా, ఏప్రిల్ 2021 లో, దేశంలో అభివృద్ధి చేయబడిన ప్రస్తుత వ్యాక్సిన్లు కరోనావైరస్ నుంచి తగినంత రక్షణను అందించవని, చైనా నిపుణులు కూడా అంగీకరించారు. ఆ వ్యాక్సిన్ ను మరింత శక్తివంతంగా చెయ్యడానికి దానికి మరికొన్ని వ్యాక్సిన్లను కూడా కలపాలని చైనా నిపుణులు ఆలోచిస్తున్నారు.

వివిధ చైనా సంస్థల అధ్యయనం ప్రకారం, ఈ చైనీస్ టీకాల ప్రభావం కేవలం 50% నుండి 79% మాత్రమే……

చైనీస్ వ్యాక్సిన్లలో ఎక్కువ భాగం సినోవాక్ అనే ప్రైవేట్ సంస్థ మరియు సినోఫార్మ్ అనే ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల తయారీలోనివే. ఈ టీకాలు మెక్సికో, టర్కీ, ఇండోనేషియా, హంగరీ, బ్రెజిల్, పాకిస్తాన్ మరియు టర్కీతో సహా ప్రపంచంలోని అనేక డజన్ల దేశాలకు పంపిణీ చేయబడ్డాయి.

Source : OPINDIA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.