సైన్యానికి అందుబాటులోనికి రానున్న షార్ట్ స్పాన్ వంతెనలు.. సరిహద్దుల్లో కీలకం కానున్న కొత్త వ్యవస్థ

385views
దేశీయంగా అభివృద్ధి చేసిన 10 మీటర్ల షార్ట్ స్పాన్ వంతెన వ్యవస్థ.. సైన్యానికి అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థకు చెందిన పరికరాలను ఆర్మీ ఇంజనీర్లకు శుక్రవారం అందించనునట్లు ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె తెలిపారు. దీన్ని రూ.492 కోట్ల వ్యయంతో డీఆర్‌డీఓ, ఆర్మీ ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందించారు.
వ్యవస్థ.. పాకిస్థాన్‌తో పశ్చిమ సరిహద్దుల్లో కార్యకలాపాల విషయంలో చిన్న నదులు, కాలువలను సలుభంగా దాటి వెళ్లడానికి వీలుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెనలు.. 70 టన్నుల ట్యాంకులను మోయగలవని అధికారులు వెల్లడించారు. గతేడాది పరిశ్రమలపై కొవిడ్ ఆంక్షలు విధించినప్పటికీ.. భారత సైన్యానికి వంతెన వ్యవస్థ సరఫరాకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.





