
702views
భారత్ లో ఏలియన్స్ హడావుడి తక్కువే. ఆకాశంలో వింత ఆకారాలు, వింత వస్తువులు పెద్దగా కనిపించవు. కానీ గుజరాత్‌లోని జునాగఢ్‌లో సోమవారం రాత్రి 10 గంటలకు ఆకాశంలో వింత కాంతి కనిపించింది. అదేంటన్నది ఎవరికీ అంతుబట్టలేదు. చాలా మంది మొబైల్ కెమెరాలకు పనిచెప్పారు. ఈ ఎగిరే వస్తువులను చూసేందుకు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. రంగురంగులుగా మెరుస్తూ ఆ కాంతి కనిపించింది. అది ఉల్క కాదనీ.. ఉల్కే అయితే అంతసేపు ఆకాశంలో స్థిరంగా ఉండదని తేల్చారు. తారాజువ్వ కూడా క్షణాల్లో కింద పడిపోతుంది కాబట్టి.. తారాజువ్వ కూడా కాదని భావిస్తున్నారు. నాలుగు లైట్లతో ఉన్నట్లుగా కనిపించిన కాంతి.. ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అదేంటనేది మాత్రం మిస్టరీగా ఉండిపోయింది.




