
1kviews
సంస్కార భారతి, ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో “బ్రహ్మ కడిగిన పాదము” పేరుతో రాష్ట్ర స్థాయి సంగీత పోటీలు నిర్వహింపబడుతున్నాయి.
ఈ పోటీలు జూనియర్స్ (12 – 25 సం. వయస్సు వారు), సీనియర్స్ (26 – 40 సం.ల వయస్సు వారు) రెండు విభాగాలుగా జరుగనున్నాయి. పోటీలలో పాల్గొనదలచిన వారు ఒకే ఒక అన్నమాచార్య కీర్తనను పాడి, రికార్డు చేసి, ఆ ఆడియోను ఆయా జిల్లాల వారీగా క్రింది పోస్టర్లో ఇచ్చిన ఫోన్ నెంబర్లకు పంపవలసిందిగా నిర్వాహకులు తెలియజేశారు. పోటీకి పంపే కీర్తన నిడివి 5 నిమిషాలకు మించరాదనే నియమం ఉంది. ఆడియోను జూన్ 15, మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా పంపాలి.
జూన్ 27, ఆదివారము సాయంత్రం ఏడు గంటలకు ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లైవ్ ద్వారా విజేతల ప్రకటన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు క్రింది పోస్టర్ ను చూడగలరు.






