
ఈ రోజులలో S.C కాలనీలలో హిందువులుగా మిగిలినవారికి పెళ్లిళ్లు అవడం కష్టంగా మారింది. క్రైస్తవ మిషనరీలు సాగించిన ప్రచారం వలన, ప్రలోభాలకు లొంగి అనేకమంది S.Cలు క్రైస్తవ మతంలోకి వెళ్లారు. ఒకప్పుడు ఏ కొందరికో పరిమితం అయిన క్రీస్తు మతం మహమ్మారిలా వ్యాపించి, మన సంస్కృతి, ధర్మాల నుండి ప్రజలను దూరం చేస్తున్నది. క్రైస్తవ పాస్టర్లు ముందుగా బాలికలను, మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారికి మాయమాటలు చెప్పి మతం మార్చారు. సున్నితమైన హృదయం గల స్త్రీలకు క్రీస్తు సిలువ కథలను చెప్పి, “పాపాల నుంచి రక్షించగల రక్షకుడు క్రీస్తు మాత్రమే” అని చెప్పి మతం మార్చారు. అనేక కుటుంబాలలో ఆడవాళ్ళ మతం ఒకటైతే….. మగవాళ్ళ మతం మరొకటి అయింది. చివరకు ఆడవారిదే పైచేయి అయి, కుటుంబాలకు కుటుంబాలు క్రైస్తవ్యంలోకి వెళ్లారు. ఈ రోజుకు కూడా చర్చి లక్ష్యం ఆడపిల్లలే.
క్రీస్తు మతంలోకి మారిన ఆడపిల్లను పెళ్లి చేసుకోవాలంటే…… అబ్బాయి హిందువైనా సరే మతం మార్చుకోవాల్సిందే. అలా మతం మార్చుకోవడానికి ఇష్టపడని అనేకమంది హిందూ హరిజన కుటుంబాలకు చెందిన మగ పిల్లలు పెళ్లిళ్లు కాకుండా మిగిలిపోతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం S.C కాలనీకి చెందిన జ్యోతి సరికొత్త మార్పుకు తెరతీసింది. గత మార్చి మాసంలోనే ప్రత్యేక పూజా కార్యక్రమం ద్వారా క్రైస్తవ్యంలో నుండి స్వధర్మంలోకి వచ్చిన జ్యోతి తనను పెళ్లి చేసుకోబోయే వరుడు హిందువై ఉండాలని ప్రకటించింది.
సమరసతా నేవా పౌండేషన్ గత కొన్ని సంవత్సరాల నుండి సనాతన ధర్మ వైభవం గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నది. దారి తప్పిన పూర్వ హిందువులను తిరిగి స్వధర్మంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నది. అందులో భాగంగా పశ్చిమ కృష్ణా డివిజన్ మహిళా కార్యకర్తలు శ్రీమతి నాగరాజ కుమారి, శ్రీమతి గౌరిల నాయకత్వంలో హిందూ ధర్మ వైభవంపై డివిజన్ వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగింది.

సనాతన ధర్మంలోని విశిష్టతను గుర్తించిన జ్యోతి ఇటీవలనే స్వధర్మంలోకి వచ్చింది. ఆమె హిందువుగా మారిన వేళా విశేషం వలన ఆమెకు వివాహం నిశ్చయమైంది. అయితే వరుడిది క్రైస్తవ కుటుంబం అవటంతో వరుడు స్వధర్మంలోకి వస్తేనే తను అతనిని పెళ్లి చేసుకుంటానని జ్యోతి ఘంటాపథంగా చెప్పింది. వరుడు సైతం పెద్ద మనసుతో తన కాబోయే భార్య కోరిక మేరకు స్వధర్మంలోకి వచ్చి మే 5 న స్థానిక అమ్మవారి దేవాలయంలో సమరసతా సేవా ఫౌండేషన్ పెద్దల సమక్షంలో తాళి కట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు.
తాము తిరిగి స్వధర్మాన్ని స్వీకరించే విషయంలో పెళ్లి కొడుకు కుటుంబం తొలుత కొంత తర్జనభర్జన పడ్డా……. అనంతరం తమ కాబోయే కోడలి కోర్కెను తీర్చడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. అందుకు సమరసతా మహిళా కార్యకర్తలు చూపిన చొరవ ప్రశంసనీయం.
జ్యోతి గత మార్చి మాసంలోనే ప్రత్యేక పూజా కార్యక్రమం ద్వారా హైందవంలోకి వచ్చింది. ఆమె చూపిన స్వధర్మాభిమానం, తీసుకున్న సాహసోపేత నిర్ణయం వలననే ఆమె హిందువును, హిందూ పద్ధతిలో వివాహం చేసుకోగలిగింది. నూతన వధూవరులను సమరసతా సేవా ఫౌండేషన్ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభినందించారు. దంపతులకు నూతన వస్త్రాలను బహూకరించారు. జ్యోతి చూపిన తెగువే ధర్మానికి రక్ష అవుతుంది. సనాతన ధర్మ జ్యోతిని నిలబెట్టడానికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జ్యోతి తన వంతు కృషి చేసింది. జ్యోతికి శుభాశీస్సులు.





