News

వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి లేని లోటు పూడ్చలేనిది : ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య

981views

శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం ఏడవ తరం 11వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు మే నెల 8వ తేది మధ్యాహ్నం 1.20 నిమిషాల కు స్వర్గస్తులైనారు. వీరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠాధిపతిగా 52 సంవత్సరాలు ఉన్నారు. వీరు ఉభయ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో స్వామి వారి భూత, భవిష్యత్ కాలజ్ఞానం గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

52 సంవత్సరాల పాటు విశేష కృషి చేసి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని పుస్తకాలు, సీడీ ల రూపంలో వీరు ప్రజలకు అందిస్తున్నారు. బ్రహ్మం గారి మఠం అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారు. అలాగే మఠానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. తెలుగు, సంస్కృతం, మరియు ఇంగ్లీష్ భాషల్లో మంచి పాండిత్యం కనబరిచారు.

1981 సంవత్సరం లో వచ్చిన వీరబ్రహ్మేంద్రస్వామి చలన చిత్రాన్ని రూపొందించే సమయంలో తన వంతు సహాయంగా చిత్రానికి కావాల్సిన వీరబ్రహ్మేంద్రస్వామి గారి సమాచారాన్ని నందమూరి తారకరామారావు గారికి వివరించారు. చరిత్ర, సాంఘిక, చారిత్రక, ఆధ్యాత్మిక విషయాలతో వీరబ్రహ్మేంద్రస్వామి రాసిన సుప్రభాతాన్ని 1983 లో ముద్రించారు.

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య, ఆదిజాంబవ ఆంధ్ర ప్రాంత అధ్యక్షులు శ్రీ మారెప్ప మరియు ఇతర పెద్దలు.

అదేవిధంగా ధర్మజాగరణ సమితి, ఆంధ్రప్రదేశ్ కు వారు నిరంతరం శుభాశీస్సులు అందజేస్తూ ఉండేవారు. విశేషంగా ఆదిజాంబవ (మాదిగ), దూదేకుల పరియోజనల ప్రారంభానికి వారి ఆశీస్సులు ఉన్నాయి. “ధర్మజాగరణ సమితి ఆంధ్ర ప్రదేశ్ తరఫున వారి ఆత్మకు సద్గతులు కలగాలని వారి కుటుంబ సభ్యులకు మరియు వారి భక్తులకు బాధను భరించే మనోస్థైర్యాన్ని ఇవ్వాలని సర్వశక్తిమంతుడగు ఆ పరాత్పరుణ్ణి ప్రార్థిస్తున్నానని, వారి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య ప్రకటించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.