
జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్ననక్సలైట్ నేత జి ఎన్ సాయిబాబాను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు లేఖ వ్రాసిన ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (DUTA) చర్యను మేథావులు, విద్యావేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడు జి ఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో అతి దగ్గరి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని తేలడంతో మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017 మార్చిలో ఆయనకు యావజ్జీవిత శిక్షను ఖరారు చేసింది. దాంతో ఢిల్లీ యూనివర్సిటీ ఆయనను గత వారం విధుల నుంచి తొలగించింది.
అయితే ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ( DUTA) యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు లేఖ వ్రాసింది. ఈ విషయం తెలిసిన మేధావులు మరియు విద్యావేత్తల బృందం (Group of intellectuals and academicians (GIA)), DUTA చర్యను తీవ్రంగా ఖండించింది.
తీవ్రమైన కేసులో శిక్ష పడిన ఒక నేరస్తుణ్ణి తిరిగి విధుల్లోకి తీసుకోమని కోరుతూ DUTA వైస్ ఛాన్సలర్ కు ఎలా లేఖ వ్రాస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. జి ఎన్ సాయిబాబా సాదాసీదా మావోయిస్టు కాదని తీవ్రమైన నేరాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నేరస్తుడనే విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒక శిక్ష పడిన దోషిని సమర్థిస్తూ లేఖ వ్రాయడంపై DUTA ను మేధావుల వేదిక తీవ్రంగా విమర్శిస్తోంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన జాతీయ రక్షణకు అంశంపై యూనివర్సిటీలోని ఇతర అధ్యాపకులు మరియు సిబ్బంది అభిప్రాయాలను తెలుసుకోకుండా DUTA వ్యవహరించడాన్ని GIA తీవ్రంగా దుయ్యబడుతోంది.
చత్తీస్గడ్ లోని బీజాపూర్ వద్ద మావోయిస్టులు జరిపిన దమనకాండలో సుమారు 24 మంది జవాన్లు మృతి చెందడంతో పాటు మరో 30 మంది గాయపడిన సంఘటన దృష్ట్యా ప్రభుత్వం కేవలం మావోయిస్టుల చర్యలను ఎదుర్కోవడానికి మాత్రమే పరిమితం కాకుండా వారి విద్వేషపూరిత సిద్ధాంతాన్నే పూర్తిగా నిర్మూలించవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలని పలువురు మేధావులు, విద్యావేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Source : Organiser.





