News

ఆ విగ్రహం భాగాలు ఎక్కడివి?

456views

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొలువైనప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట హిందూ దేవుళ్ళ విగ్రహాలు, దేవాలయాలు ధ్వంసం అవుతూనే ఉన్నాయి. దీనిపైన అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయపక్షాలు, హిందూ సంఘాలు తరచుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి, పోలీసులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అంతటి సీరియస్ విషయాన్ని సైతం ప్రభుత్వం లైట్ తీసుకుంటూ ఉండడం, మంత్రులు, MLA లు బాధ్యతా రహితంగా, చులకనగా మాట్లాడుతూ ఉండడం అనేకమందిని నొప్పిస్తూ, ఆవేదనకు గురి చేస్తూ ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏమీ చెయ్యలేమన్న అభిప్రాయంతో మిన్నకుండి పోతున్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవీదేవతల విగ్రహాలపై తరచూ జరుగుతున్న దాడులకు కొనసాగింపా అన్నట్లుగా మరో సంఘటన వెలుగు చూసింది.

గుంటూరు జిల్లా అమరావతిలోని ధ్యానబుద్ధ పుష్కర స్నాన ఘాట్‌లో దేవుడి విగ్రహం భాగాలు పడేసి ఉండటం సంచలనం కలిగించింది. విగ్రహాన్ని దుండగులు ముక్కలు చేసి ఘాట్‌లో చెల్లాచెదురుగా పడేశారు. ఆనవాళ్లు కనిపించకుండా కాల్చే ప్రయత్నం చేశారు. శిరస్సు భాగం మాత్రం ఆ ప్రాంతంలో కనిపించ లేదు. విగ్రహాన్ని ఎక్కడ నుంచి ఇక్కడకు తరలించారు…అది ఏ దేవుడిది అన్న దానిపై స్పష్టత లేదు. విషయం తెలుసుకున్న అమరావతి పోలీసులు ఘాట్‌ వద్దకు చేరుకొని … విగ్రహం భాగాలను గోనెసంచిలో తీసుకెళ్లి రహస్య ప్రదేశంలో భద్రపరిచారు. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చేరవేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.