ఢిల్లీలోని రైతులకు మద్యం సరఫరా చేసి ఉద్యమాన్ని సజీవంగా ఉంచండి – కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకురాలి వినతి

ఢిల్లీలోని రైతుల నిరసన స్థలానికి మద్యం సరఫరా చేయాలని, ఆందోళనను సజీవంగా ఉంచాలని హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు విద్యానోరి దనోడా కాంగ్రెస్ నాయకులను, కార్మికులను కోరారు.
అక్టోబర్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తరువాత, పార్టీ దాదాపుగా చచ్చిపోయిందని, కానీ ఈ రైతుల ఆందోళన పార్టీని తిరిగి బ్రతికించే అవకాశం ఇచ్చిందని ఆమె పార్టీ కార్యకర్తలతో అన్నారు.
“ఢిల్లీలో జనవరి 26 న జరిగిన హింసాకాండ తరువాత ఆందోళన దాదాపుగా ముగిసి పోయింది. కానీ, ఏదో ఒకవిధంగా తిరిగి పుంజుకుంటోంది. కనుక ఈ అవకాశాన్ని వృధా చేయకండి. పార్టీలో జీవాన్ని నింపేందుకు ఉపయోగించండి.” అని పార్టీ కార్యకర్తలను ఆమె కోరారు. కాంగ్రెస్ టికెట్ పై హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విద్యానోరి దనోడా రెండుసార్లు పోటీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు ప్రగతిశీల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ రైతుల పేరుతో కొందరు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలకు దిగారు.
నిరసనలలో ఖలిస్తానీలు మరియు ఇతర సంఘ విద్రోహ శక్తులు జొరబడినట్లు పలు నివేదికలు వచ్చాయి. రైతుల పేరుతో ఆందోళన చేస్తున్నవారు జనవరి 26 న ఢిల్లీలో పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు.
వారితో ప్రభుత్వం పలు దఫాలు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. వ్యవసాయ చట్టాల అమలును 18 నెలల పాటు నిలిపివేస్తామని, ఈలోపు చట్టంపై ఏవైనా అభ్యంతరాలుంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని నిరసన వ్యక్తం చేసిన రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది . కానీ, రైతుల పేరుతో ఆందోళన చేస్తున్న వారు ఎప్పటికప్పుడు తమ డిమాండ్లు మారుస్తుండడం విశేషం.
Source : Organiser
https://www.organiser.org/Encyc/2021/2/15/-Farmers-agitation-is-an-opportunity-to-revive-the-nearly-dead-party-Congress-Neta-Urges-to-Supply-Liquor-and-Keep-Farmers-Agitation-Alive.html





