News

వాచ్ మన్ కూతురు రాజేశ్వరి అయోధ్య రామ మందిరం కోసం ఏం చేసింది?

184views

యోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ నిమిత్తం గుంటూరు ఎన్జీవో కాలనీలో కొంతమంది హిందూ సంఘాల కార్యకర్తలు తిరుగుతున్నారు. ఒక అపార్ట్ మెంట్ దగ్గర ఆ అపార్ట్మెంట్ వాచ్ మన్ కుమార్తె రాజేశ్వరి అనే ఐదవ తరగతి బాలిక ఆ అపార్ట్మెంట్ లో ఉన్న అన్ని గృహాలను దగ్గర ఉండి పరిచయం చేస్తూ కార్యకర్తలతో కలిసి తిరిగింది . అన్నిచోట్ల కరపత్రం ఇచ్చి కార్యకర్తలు వివరించడాన్ని ఆలకించింది. చివర్లో అన్నీ పూర్తి చేసుకుని వేరే అపార్ట్ మెంట్ కి వెళ్తుండగా వారిని ఆపి చిన్నగా వచ్చి పది రూపాయలు చేతిలో పెట్టి “ఆ రాములవారికి నేను కూడా ఇవ్వచ్చా?” అని అడిగింది. ఆశ్చర్యపోవడం కార్యకర్తల వంతైంది. ఆ చిట్టి తల్లిలోని రామ భక్తికి కార్యకర్తలు ముగ్ధులైపోయారు. నిజంగా ఆ పాప ఎంత ధన్యురాలో కదా?

అలాగే ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటున్నారు. ఆయన రిటైర్డ్ ఉద్యోగి. గేటు తీయటానికి కూడా ఓపిక లేదు. అయినా వచ్చి తీశారు. “మేము అయోధ్య రామమందిరం నిధి కోసం వచ్చాము” అని చెప్పిన వెంటనే లోపలకి వెళ్లి చెక్ బుక్ తీసుకుని వచ్చి 10,000 (అక్షరాలా పదివేల రూపాయలు) వ్రాసి ఇచ్చారు. నిధి సేకరణ కోసం తిరుగుతున్న కార్యకర్తలకు ఇలాంటి సంఘటనలు ప్రతిరోజూ ఎన్నో ఎదురవుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.