News

హిందూ మ‌హిళ‌లే లక్ష్యంగా అమెజాన్ అశ్లీల గ్రంథాలు – అమెజాన్ కు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు

811views

హిందూ మ‌హిళ‌ల‌ను అత్యంత అసభ్యంగా చిత్రీకరిస్తూ అస్లీల సాహిత్యాన్ని వ్యాప్తి చేస్తున్న అమెజాన్ సంస్థ పట్ల జాతీయ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శ‌ర్మ అమెజాన్ సంస్థ భారతదేశ ప్ర‌తినిధి అమిత్ అగ‌ర్వాల్‌కు నోటీసులు జారీచేశారు.

పుస్తకాలను డిజిటలైజ్ చేసి, ఆ డిజిటల్ కాపీలను పాఠకులు చదివేందుకు వీలుగా అమెజాన్ సంస్థ కిండెల్ అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారుచేసిన విషయం తెలిసిందే. కిండెల్ లో డిజిటలైజ్ చేసిన అనేక పుస్తకాలను నిక్షిప్తం చేసుకుని, ఎక్కడికైనా సులభంగా తీసుకునివెళ్ళవచ్చు. తమ ఈ-మార్కెటింగ్ వెబ్సైట్ ద్వారా ఈ పరికరాన్ని వినియోగదారులకు విక్రయిస్తున్న అమెజాన్ సంస్థ, ఇది కొన్నవారికి పరికరంతో పాటు కొన్ని పుస్తకాలను ఉచితంగా అందజేస్తోంది.

అయితే ‘స్వరాజ్య’ ప్రచురించిన కధనం ద్వారా విస్మయపరిచే విషయాలు వెలుగుచూశాయి. హిందూ మహిళలను అత్యంత దారుణంగా అవమానిస్తూ, అశ్లీల సాహిత్యాన్ని కిండిల్ ద్వారా అమెజాన్ వ్యాప్తి చేస్తున్న విషయం వెలుగుచూసింది.

హిందూ స్త్రీలకు ముస్లిం వ్యక్తులతో అక్రమ సంబంధాలను అంటగట్టి రాసిన కల్పిత కథలను పుస్తకాలుగా ప్రచురిస్తూ కిండిల్ పాఠకులకు వ్యాప్తిచేయడంపై వెలువడిన ఈ కథనానికి జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.
అమెజా‌న్ లాంటి ఈ-కామ‌ర్స్ సంస్థ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా అశ్లీల పుస్త‌కాలు ఉంచ‌డం స‌రికాద‌ని వెంట‌నే వాటిని తొల‌గించాల‌ని మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ ఆదేశించారు.

Source : Swarajya & VSK Telangana

https://swarajyamag.com/politics/amazon-kindle-love-jihad-pornography-rape-fantasy-books-hinduwomen-muslimmen

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.