NewsProgramms

నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి

81views

ర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవాసమితి ఆవాసం లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64 వ వర్ధంతి స్ఫూర్తిదాయకంగా జరిగింది.

సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ కె. నాగసుబ్బారెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భారత్ అకాడమీ డైరెక్టర్ శ్రీ. గోపీ క్రిష్ణ జ్యోతి ప్రజ్వలన గావించగా, ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ బైసాని మనోహర్, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాలార్పణ గావించారు. సంఘమిత్ర రాష్ట్ర సహకార్రదర్శి శ్రీ. చిలుకూరు శ్రీనివాస్ వేదిక నలంకరించారు.

శ్రీ. బైసాని మనోహర్ అంబేత్కర్ ఎలాంటి సామాజిక నేపథ్యం నుండి ఎన్నో అవరోధాలను, వివక్షతను అధిగమించి ఈ స్థాయికెదిగాడో వివరించారు.

శ్రీ గోపీ క్రిష్ణ మాట్లాడుతూ అంబేత్కర్ గారు గొప్ప మేధావిగా గుర్తించి ఐక్యరాజ్య సమితి, ఆయన వర్ధంతిని “ప్రపంచ మేధావుల దినంగా” ప్రకటించారని తెలియ జేశారు. ఆయనను స్పూర్తిగా తీసుకొని చిన్నారులు ఎదిగి ఆ మహాపురుషునిలా బడుగు బలహీనవర్గాల వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని సందేశమిచ్చారు.

సంఘమిత్ర రాష్ట్ర సహకార్యదర్శి శ్రీ శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేత్కర్ స్పూర్తితో సంఘమిత్ర, బడుగు, బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులు, దీనబాంధవుల సేవలో పునీతమవుతున్నట్లు తెలియ జేశారు.

నిరాశ్రిత బాలుర ఆవాసం, గిరిజన గూడేలలో మొబైల్ మెడికల్ డిస్పెన్సరీతో వైద్యసేవలు, దుస్తులు పంపిణీ, హరిజన వాడల్లో, బస్తీల్లో మెడికల్ క్యాంపులు, అభ్యాసికలు, నిరుద్యోగులకు కోచింగ్ క్లాసులు భజన కార్యక్రమాలతో పాటు ఎన్నో సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియ జేశారు.

కార్యక్రమంలో విభాగ్ సంఘ్ చాలక్ డా. ఉదయశంకర్, సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ జూలెపల్లి వెంకటేశ్వర్లు, సంఘటనా కార్యదర్శి శ్రీమతి జయశ్రీ, కార్యవర్గ సభ్యులు శ్రీమతి వెంకటేశ్వరి, డా. అశోక్ , శ్రీ మహేశ్వరరెడ్డి, శ్రీ ఉసిరికాయలు రమణయ్య గౌడ్, శ్రీ ఈ. వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.