
545views
వికీపీడియాలో తప్పుగా చూపించిన జమ్ము కశ్మీర్ మ్యాప్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఐటీ చట్టం 2000, సెక్షన్ 69ఏ ప్రకారం సంబంధిత లింకును తొలగించాలంటూ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వికీపీడియాకు ఆదేశాలు జారీ చేసింది.
భారత్, భూటాన్ సంబంధాలకు సంబంధించిన వికీపీడియా పేజీలో జమ్ము-కశ్మీర్ మ్యాప్‌ను తప్పుగా చూపినట్టు ఓ ట్విటర్ వినియోగదారుడు గుర్తించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా ఉండటంతో సదరు మ్యాప్‌ను తొలగించాలని కేంద్రం వికీపీడియాకు నవంబర్ 27న ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.





