బికినీ భామ ఫొటోకు పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి లైక్ – ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు

పోప్ ఫ్రాన్సిస్ చిక్కుల్లో పడ్డారు. ఎలా జరిగిందో తెలీదు కానీ, ఇన్‌స్టాగ్రామ్ లోని ఓ బికినీ భామ ఫొటోకు పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఖాతా నుంచి ‘లైక్’ వెళ్ళింది. ఇప్పుడు ఇది కాస్తా పోప్ ఫ్రాన్సిస్ కు పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది.
అసలేం జరిగిందంటే..
మోడల్ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్ లాకర్ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఎంతలా అంటే.. 1.5 మిలియన్లకి పైగా లైక్స్ దీనికి వచ్చాయి. అయితే, ఈ లైక్స్ లో పోప్ ఫ్రాన్సిస్ లైక్ కూడా ఉంది. ఆయన అధికారిక ఖాతా నుంచి ఈనెల 13న లైక్ వచ్చింది. ఇప్పుడు ఇది పెద్ద సంచలనంగా మారిపోయింది. ఈ లైక్ స్క్రీన్ షాట్ ను నటాలియా మానేజ్‌మెంట్ కంపెనీ సీఓవై.కో తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్ ఫ్రాన్సిస్ లైక్ చేసిన స్క్రీన్ షాట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ‘సీఓవై.కోకి పోప్ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానిక్ క్వీన్ నటాలియాకు ధన్యవాదాలు’ అంటూ స్క్రీన్ షాట్ ని షేర్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.

ఈ ట్రోలింగ్ తో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్ ఫోటోని లైక్ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. వాటికన్ ప్రతినిధి గార్డియన్ తో మాట్లాడుతూ, “హోలీ సీ నుంచి” లైక్ “వచ్చిందని భావిస్తున్నాం. వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్‌స్టాగ్రామ్ ని కోరాం” అని తెలిపారు. అయినప్పటికీ పోప్ ఫ్రాన్సిస్ పై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో 971 పోస్టులు ఉన్నాయి. వేరే ఇతర అకౌంట్‌లని ఆయన ఫాలో కారు..
Source : hmtv





