
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శనివారం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాను అందుబాటులో ఉంచింది. కరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న తితిదే.. శ్రీవారి దర్శన టిక్కెట్లను ఆల్‌లైన్ ద్వారా విక్రయిస్తోంది. టిక్కెట్లు పొందిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. టిక్కెట్లు లేనివారిని అలిపిరి తనిఖీ కేంద్రంలోనే నిలిపివేస్తున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లతో పాటు కల్యాణోత్సవం టిక్కెట్లను కూడా తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. కల్యాణం టిక్కెట్లు పొందిన వారి గోత్ర నామాలతో సేవను ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే.. ఎస్‌వీబీసీ ఛానల్ ద్వారా సేవను ప్రత్యక్షప్రసారం చేస్తోంది. టిక్కెట్లు పొందిన వారికి కల్యాణోత్సవ అక్షింతలతో పాటు, వస్త్రాలను తపాలా ద్వారా ఇంటికి పంపనున్నట్టు తితిదే అధికారులు తెలిపారు.
 
			




