News

జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ పై పిటిషన్ తిరస్కరణ

588views

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ వ్యవహార శైలిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్‌ గొగొయ్‌ తీరుపై ఈ వ్యాజ్యం దాఖలైంది. గత రెండేళ్లుగా వాదనల కోసం ఎందుకు అడగలేదని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జస్టిస్‌ గొగొయ్‌ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యం చెల్లదని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్ దురుద్దేశ పూరితమైందని కోర్టు అభిప్రాయపడింది.

మరిన్న  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.