News

జమ్మూ కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల అరెస్టు & ఇద్దరు హతం

595views

మ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా మాల్‌దేరా ప్రాంతంలో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. ఆ నలుగురు ఈ మధ్యే ఉగ్రవాద శిబిరాల్లో చేరినట్లు సైన్యం గుర్తించింది. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌లో సోమవారం ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లా క్రీకి ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర దాడిలో ఇద్దరు జవానులు, ఓ పోలీసు మృతిచెందారు. ఘటన అనంతరం కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.