News

హోం మంత్రి సుచరిత ఎన్నికను రద్దు చేయండి : రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన LRPF

2kviews

తాను క్రైస్తవురాలై ఉండీ ఎన్నికలలో SC రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎన్నికను రద్దు చెయ్యాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది. తాను క్రైస్తవురాలినని, యేసు ప్రభువును ప్రార్థిస్తానని ఆమె స్వయంగా “ఐ డ్రీం మీడియా” యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. ఆ వీడియోను కూడా జత చేసి హోం మంత్రి సుచరిత రిజర్వేషన్లను దుర్వినియోగ పరచుకున్నట్లుగానూ, తాను రిజర్వు స్థానం నుంచి పోటీ చెయ్యడానికి అనర్హురాలైనప్పటికీ ఆమె తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి రిజర్వుడు స్థానం నుంచి ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు కనుక ఆమెపై అనర్హత వేటు వెయ్యవలసినదిగా రాష్ట్రపతిని కోరుతూ LRPF రాష్ట్రపతి భవన్ కు లేఖ వ్రాసింది. మేకతోటి సుచరిత తప్పుడు కుల ధృవీకరణతో పోటీ చేసినట్లుగా నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా ఆ లేఖ వెంట పొందుపరచినట్లుగా LRPF తెలుపుతోంది. ఆ మేరకు ఈ అంశాలను LRPF వర్గాలు ట్విట్టర్ ద్వారా తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.