News

జమ్ముకశ్మీర్‌ : ఉగ్రదాడిలో అమరులైన ముగ్గురు పోలీసులు

399views

మ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లాలోని క్రీరి చెక్‌పోస్టు వద్ద సీఆర్‌పీఎఫ్‌, జమ్ము పోలీసులు కలిసి విధులు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున చెక్‌పోస్టు వద్దఉన్న పోలీసులపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరాయయ్యారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు అదనపు బలగాలు పంపించామని జమ్ముకశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. గడిచిన వారం రోజుల్లో పోలీసులపై దాడులు జరగడం ఇది మూడోసారి. ఆగస్టు 14వ తేదీన శ్రీనగర్‌ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.