
చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. చైనా ఆధారితంగా తయారైన టిక్‌టాక్, ఎంఐ వీడియో కాల్ సహా మొత్తం 59 యాప్‌లను దేశ ప్రజలు వాడొద్దని సూచించింది. ఈ యాప్‌లు ద్వారా భారత్ నుంచి రకరకాల సమాచారం సేకరిస్తున్నాయంటూ చైనాకు భారత్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా డ్రాగన్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల భారత్ -చైనా సరిహద్దులో గల్వాన్ వ్యాలీ వద్ద నెలకొన్న భీకర ఘర్షణ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిశీలనలోకి తీసుకున్న కేంద్రం ఓవైపు శాంతియుతంగా చర్చలు జరుపుతూనే.. మరోవైపు, చైనా ఆగడాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. చైనా ఉత్పత్తులు, చైనా పేరుతో తయారై భారత్‌లో అనేక రకాలుగా చలామణిఅవుతున్న యాప్‌లు దేశ భద్రత, రక్షణకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాయని పసిగట్టిన భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే ఇంకా మొబైల్ ఫోన్లలోని చైనా యాప్ లు పని చేస్తూ ఉన్న, గూగుల్ ప్లే స్టోర్ లో చైనా యాప్ లు ఇంకా కనిపిస్తూనే ఉన్న నేపథ్యంలో నెటిజన్లు చైనా యాప్లు డౌన్లోడ్ చేసుకోకుండా, ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న యాప్ లను వాడకుండా ప్రభుత్వం ఏ విధంగా కట్టడి చేయనున్నదనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
కేంద్రం నిషేధించిన చైనా యాప్‌ల జాబితా ఇదే..






