News

ఉగ్రవాదుల దాడిలో ఓ జవాను, ఐదేళ్ల బాలుడు మృతి

90views

మ్మూకశ్మీర్‌లో ముష్కరులు భారత జవానులపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ జవాను, ఐదేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహరా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం 12:10 గంటలకు బిజ్‌బెహరా ప్రాంతంలోని పర్షాహి బాగ్ వంతెన సమీపంలో సీఆర్‌పీఎఫ్ 90 బెటాలియన్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఓ పోలీసు అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. సమావేశంపై జరిపిన కాల్పుల్లో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవానుతోపాటు, 5 సంవత్సరాల బాలుడు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొన్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, ఉగ్రవాదుల ఏరివేతకు వేట ప్రారంభించామని ఆయన చెప్పారు. మరో ఘటనలో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.