
1.1kviews
కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సర్కార్.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్ లేదా మార్కులపై నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.





