News

ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదుల హతం

459views

మ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లాలోని పింజోరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. ముష్కరులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.

పింజోరాకు 12 కి.మీ దూరంలో ఉన్న రెబన్‌ ప్రాంతంలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మృతుల్లో ఓ హిజ్బుల్‌ కమాండర్‌ కూడా ఉన్నాడు. దాదాపు 12 గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం. నేటి ఎన్‌కౌంటర్‌తో కలిపి 24 గంటల్లో 9 మంది ముష్కరుల్ని సైన్యం అంతమొందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.